Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ పట్టణంలో ఈనెల 13న అస్మిత ఖెలో ఇండియా ఉమెన్స్ సైకిలింగ్ సిటీ లీగ్ పోటీలు

    Author VENKATESH | 11 Jun 2026, 05:35 PM | TELANGANA
    మక్తల్ పట్టణంలో ఈనెల 13న అస్మిత ఖెలో ఇండియా ఉమెన్స్ సైకిలింగ్ సిటీ లీగ్ పోటీలు

    - బాలికలు , మహిళలకు 5 కి.మీ, 10 కి.మీ. రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలు

    - అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయండి

    - సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం

    ఇవి కూడా చదవండి

    నారాయణపేట జిల్లా, జూన్ 11 (బి వి కే న్యూస్ )

    సైకిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖె లో ఇండియా, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, ఈ నెల 13న నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అస్మిత ఖెలో ఇండియా ఉమెన్స్ సైకిలింగ్ సిటీ లీగ్ బాలికలకు, మహిళలకు 5 కి.మీ, 10 కి.మీ. రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలు నిర్వహిస్తున్నామని సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలంలు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మహిళలకు సైకిల్ పోటీలు నిర్వహించుటకు కొత్త గార్లపల్లి రోడ్డు అణువుగా లేనందువలన ఈనెల 11న మరమ్మతులు చేయించడం జరిగిందని బి.గోపాలం తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 296 మంది బాలికలు, మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆసక్తిగల వారందరూ బాలికలు ,మహిళలు సొంత సైకి ల్ తో, క్రీడా దుస్తులు ధరించి ఈ నెల 13న శనివారము ఉదయం 7 గంటలకు ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో రిపోర్టు చేయాలని వారు తెలిపారు. ఈ సైకిల్ పోటీలను రాష్ట్ర క్రీడ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, పార్లమెంటు సభ్యురాలు డీకే .అరుణ గారు ప్రారంభిస్తారని బి.గోపాలం తెలిపారు. గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్ ,మెడల్స్ అందజేస్తామని ,అలాగే పాల్గొన్న మహిళలందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తామని వారు తెలిపారు. ఈ ఖేలో ఇండియా సైకిలింగ్ సర్టిఫికెట్స్ చాలా విలువైనవని ,స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఉపయోగపడతాయని వారు తెలిపారు. పాల్గొంటున్న సైకిలింగ్ మహిళా రైడర్స్ అందరికీ భోజన వసతి చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ అందజేస్తారని బి.గోపాలం తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తాన్ సింగ్,ఉపాధ్యక్షుడు జి. శివకుమార్, నీలిగిరి పాల్గొన్నారు.
    మిగతా వివరాలకు 77 02 71 31 39 ను సంప్రదించగలరు.