Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తంగిడి గ్రామం లో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం...

    Author VENKATESH | 11 Jun 2026, 06:06 PM | TELANGANA, నారాయణపేట
    తంగిడి గ్రామం లో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం...

    నారాయణపేట జిల్లా, జూన్ 11 (బి.కే. వి ) న్యూస్

    తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో, వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి, తంగడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో... గురువారం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి వ్యవస్థాపకులు అల్కూరి రవికుమార్ తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా మండలం అధ్యక్షుడు రాజప్ప గౌడ, తంగేడి సర్పంచ్ లింగప్ప, ఉప సర్పంచ్ కీరప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరూపాక్ష ల ఆధ్వర్యంలో
    ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించగా... సుమారు 40మంది వరకు ఉచిత కంటి పరీక్షలు చేపట్టగా.. దాదాపు 15మంది వరకు శస్త్ర చికిత్స కోసం రాంరెడ్డి కంటి ఆసుపత్రి కి తరలించామని అన్నారు.

    వాకిటి శ్రీహరి అన్న సేవాసమితి ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, వేలాది మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేపట్టామని చెప్పారు. సహకరించిన మంత్రి వాకిటి శ్రీహరికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు హనుమంతరాయ, వాదిరాజ్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్ఫరాజ్, సురేష్ , డీలర్ చాంద్ ఆనంద్ , గ్రామ సెక్రెటరీ వీరేశం, వార్డు సభ్యులు , వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి