Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాలుష్య కాసారంగా రాయగిరి చెరువు - దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న యాదాద్రి భక్తులు

    Author VENKATESH | 12 Jun 2026, 12:19 PM | TELANGANA
    కాలుష్య కాసారంగా రాయగిరి చెరువు - దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న యాదాద్రి భక్తులు

    పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధి చేశాకే బయటకు వదలాలి. ఇలా చేయటం వల్ల పర్యావరణం కాలుష్యం కాదు. ఇది తప్పకుండా చేయాల్సిన పని. ఎందుకంటే ఆ కలుషిత నీళ్లు జనాలు తాగే నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అయితే యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ పరిశ్రమలో మాత్రం అలాంటిదేం కనిపించడం లేదు. నిబంధనలకు నీళ్లొదులుతూ పరిశ్రమ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ జలాలను చెరువులోకి వదులుతున్నారు. ఫలితంగా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు వచ్చే భక్తులకు సైతం ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

    విస్తరణ పనుల్లో భాగంగా వెలుగులోకి : యాదాద్రి రైల్వే స్టేషన్‌కు సమీపంలో రాయగిరి చెరువు ఉంది. అక్కడే వేప నూనె, వేప పిండి వంటి ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ ఉత్పత్తులను సేంద్రీయ పురుగు మందుల తయారీకి వినియోగిస్తారు. అయితే రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొంతకాలంగా ఈ ప్రాంతంలో యాదాద్రి ఎంఎంటీఎస్​​ ఫేజ్‌-2 విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే వ్యర్థ జలాలను నేరుగా రాయగిరి చెరువులోకి కలిపే అనుసంధాన వ్యవస్థ బయటపడింది.


    స్థానికుల ఆవేదన : ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న ఈ పైప్‌లైన్ నుంచి సదరు కర్మాగారం గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ జలాలను రాయగిరి చెరువులోకి వదిలిపెట్టేవారు. ప్రాజెక్టు పనులకు అడ్డంగా వస్తున్నాయని నీరు వెళ్లే దారిని రైల్వేశాఖ వారు మూసివేశారు. దీంతో నీరంతా రైల్వే పైవంతెన కిందకు చేరింది. ఈ నీరు నిల్వ ఉండటంతో విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు, రైల్వే కార్మికులు ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్​ దృష్టికి తీసుకొచ్చారు. ముక్కుపుటాలు అదిరిపోయేలా వాసన, కళ్ల మంటతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులను దుర్వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    "ఈ చెరువు కింద దాదాపు ఓ 400 ఎకరాలు సేద్యం చేసుకోవటానికి పొలాలు ఉన్నాయి. ఈ కెమికల్​ గ్రౌండ్​ వాటర్​లోకి వెళ్లి బోర్లలోకి వస్తున్నాయి. దీంతో పంట దిగుబడి తక్కువగా వస్తోంది. అందుకు పొల్యూషన్​ బోర్డ్​ వాళ్లు ప్రత్యేకమైన చర్య తీసుకుని, ఈ చెరువులోకి ఆ వాటర్​ను వదలకుండా చూడాలి. అలాగే పర్యాటకులకు ఈ వాసన రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" - స్థానికులు

    ఇవి కూడా చదవండి

    నష్టపోతున్న రైతులు : చెరువులో పరిశ్రమ వ్యర్థాలు చేరడంతో మేకలు, గొర్రెలు ఈ నీటిని తాగడం లేదని కాపరులు చెబుతున్నారు. 50 మంది రైతులు 100 ఎకరాల్లో ఈ చెరువు ఆయకట్టు కింద పంటలు సాగుచేస్తుండగా, ఈ నీరు భూగర్భ జలాల్లో ఇంకిపోతుండటంతో దిగుబడి తగ్గుతోందని చెబుతున్నారు. వరి వేస్తే తాలు, నూక ఎక్కువ శాతం వస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

    "గ్రౌండ్​ వాటర్​ కూడా కలుషితమవుతున్నాయి. బోర్లలోకి ఆ కెమికల్​ చేరుతుంది. గొర్లు ఆ నీళ్లు తాగలేకపోతున్నాయి. అలాగే పంట నష్టం కూడా జరుగుతుంది. బోర్లలో నుంచి కెమికల్​ రావటంతో వరి చేను చనిపోతుంది. అలాగే పశువులు కూడా అదే గడ్డిని మేస్తున్నాయి. మనుషులు అక్కడకు వచ్చినప్పుడు చాలా దుర్వాసన వస్తోంది. దీనిని అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం" - స్థానికులు

    క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు : పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వాగులు, చెరువులు, వ్యవసాయ భూములు సహా భూగర్భంలోకి నేరుగా వదలకూడదు. ఈటీపీల ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు మచ్చుకు కూడా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం సంస్థ ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

    "యాదాద్రి టెంపుల్​ డెవలప్​మెంట్​ బోర్డు కిందనే ఈ ప్రాంతం వస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ శిల్పారామాన్ని నిర్మించారు. అక్కడికి యాత్రికులు, పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. గతంలో ఆ చెరువులో బోట్లు వేసి తిప్పారు. ప్రస్తుతం ఈ దుర్గంధం వల్ల పర్యాటకులు బోట్లు ఎక్కట్లేదు. అలాగే యాత్రికులకు కూడా ఇక్కడ సేద తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నో రూ.కోట్లు వెచ్చించి ఈ గార్డెన్​ను ఏర్పాటు చేశారు. కానీ దీంట్లోకి రావటానికి యాత్రికులు ఆసక్తి చూపటం లేదు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం" -