Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమంతకు ‘ఐ లవ్ యూ’ చెప్పమన్న యాంక‌ర‌మ్మ‌..

    Author VENKATESH | 17 Jun 2026, 11:37 AM | Cinema
     సమంతకు ‘ఐ లవ్ యూ’ చెప్పమన్న యాంక‌ర‌మ్మ‌..

    సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకురాలు నందినీ రెడ్డి, నటి-నిర్మాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మరియు చిత్రబృందం హాజరై సందడి చేశారు. ఈవెంట్ మొత్తం సమంత అభిమానుల సందడితో మార్మోగిపోయింది. ముఖ్యంగా రాజ్ నిడిమోరు స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గట్టిగా నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ ఏమంటున్నారో తనకు సరిగా వినిపించడం లేదని రాజ్ చెప్పగా, యాంకర్ సుమ వెంటనే స్పందించారు. “అభిమానులు సమంతకు ఒకసారి ‘ఐ లవ్ యూ’ చెప్పమని అడుగుతున్నారు” అని చెప్పడంతో సభలో చప్పట్లు, కేకలు మార్మోగాయి
    అయితే ఆ ప్రశ్నకు రాజ్ నిడిమోరు ఎంతో చాకచక్యంగా స్పందించారు. ఇప్పటికే స్టేజ్‌పై చాలామంది ఆమెకు ఆ మాట చెప్పారు. కింద ఉన్న ప్రేక్షకులు కూడా అదే చెబుతున్నారు. అందులో కొత్తగా నేను చెప్పాల్సిందేమీ లేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి సమంత నటనపై రాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. షూటింగ్ సమయంలో సమంతలోని అద్భుతమైన నటన తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. తాము ఒక విధంగా ఊహించిన సన్నివేశాలను సమంత ఒక్క టేక్‌లోనే మరింత ప్రభావవంతంగా చేసి చూపించేదని చెప్పారు