Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    Author VENKATESH | 19 Jun 2026, 02:29 PM | TELANGANA
    మక్తల్ లో  ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    - చిన్నారిచే కేక్ కట్ చేయించి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహింపచేసిన మంత్రి వాకిటి శ్రీహరి
    నారాయణపేట జిల్లా, జూన్ 19 (బివికే న్యూస్)
    లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ నాయకులు, అభిమానుల మధ్య చిన్నారి చే కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ. ..
    దేశంలో కులాలు మతాల పేరుతో విడగొడుతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా 4200 కిలోమీటర్ లు నడిచి భారత్ జోడోయాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల ఐక్యత కు కృషి చేశారన్నారు.
    మనమేంతో మనకంత అనే నినాదంతో జిత్నే అబాది హే ఉత్నే ఇసెదరి మిల్నా చాహియే అని దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యం తో రాష్ట్రం లో కుల గణన చేశామని తెలిపారు. చట్ట సభల్లో ఇంకా అడుగుపెట్టని వెనకబడిన జాతులు ఉన్నాయని, వారి వెనకబాటు తనం పోగొట్టి వారిని అన్నీ రంగాల్లో ఉన్నత స్థాయి ki తెచ్చే విధంగా రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ గారికి జన్మదిన సందర్భంగా వారికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా శక్తిని ఇవ్వాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.