Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీసీ హాస్టల్ ను ఎత్తివేయద్దు బీసీ జేఏసీ డిమాండ్.

    Author VENKATESH | 19 Jun 2026, 05:08 PM | TELANGANA
    బీసీ హాస్టల్ ను ఎత్తివేయద్దు బీసీ జేఏసీ డిమాండ్.

    ముకరాంపురం: ముకరాంపురంలోని పాఠశాల స్థాయి బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని ఎత్తివేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని బీసీ సంఘాల జేఏసీ ఆరోపించారు . ఈరోజు ఆ వసతి గృహాన్ని జేఏసీ నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు , దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ , మియాపురం రవీంద్ర చారి లు సందర్శించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈనెల 15 పాఠశాలలు వసతి గృహాలు ప్రారంభం కాగా ఈ యొక్క పాఠశాల స్థాయి బీసీ వసతి గృహాన్ని అధికారులు ఇప్పటికీ తెరవలేదు బిసి జేఏసీ పక్షాన అధికారులను నిలదీయగా ఇక్కడ విద్యార్థులు రావడంలేదని అందుకే మూసివేసామని చెప్పారు దీనిలో 30 మంది పైగా విద్యార్థులు వసతి గృహంలో ఉండగా వీరిని వసతి గృహానికి రావద్దని అలాగే నూతన అడ్మిషన్లను తీసుకోవడం లేదు నగరంలో బీసీ విద్యార్థుల కోసం పాఠశాల స్థాయిలో ఒక్క వసతి గృహం కూడా మరొకటి లేదు. ప్రస్తుతం ఉన్న ఈ వసతిగృహంలో మంథని లాంటి సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఉంటున్నారు అధికారులు నూతన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు ఉన్న విద్యార్థులను వేరే వసతి గృహానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క వసతి గృహాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు పాఠశాల స్థాయి విద్యార్థుల కొరకు ఉన్న ఈ బీసీ వసతి గృహాన్ని తరలించొద్దని ఉన్నత అధికారులను బీసీ జేఏసీ కోరుతుంది వెంటనే ఈ యొక్క వసతి గృహాన్ని ప్రారంభించి పాత విద్యార్థులను రప్పించి నూతన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతాం . నగరంలో రెండు కళాశాల స్థాయి బీసీ బాలికల వసతి గృహాలకు , కళాశాల స్థాయి బీసీ బాలుర వసతి గృహానికి పూర్తిస్థాయిసంరక్షణాధికారులు లేరు ఇతరసంరక్షణ అధికారులఅదనపు బాధ్యతలు అప్పగించారు ఈ మూడు వసతి గృహాలలో దాదాపు ఒక్కో వసతి గృహంలో 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు ఇలా ఇన్చార్జిల వల్ల విద్యార్థు లు ఇబ్బందులకు గురై ప్రమాదం ఉంది వెంటనే పూర్తిస్థాయి సంరక్షణ అధికారులునియమించాలని ఉన్నతాధికారులను బిసి జేఏసీ కోరుతుందని తెలిపారు.