Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలి

    Author VENKATESH | 20 Jun 2026, 05:42 PM | నారాయణపేట
    ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలి

    - శివరాజు పటేల్ కు రక్షణ కల్పించాలి

    - మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
    పి నరసింహ గౌడ్ డిమాండ్

    నారాయణపేట జిల్లా, జూన్ 20(బి వీకే న్యూస్)

    ఇవి కూడా చదవండి

    కృష్ణ మండలంలోని ఇసుక మాఫియా రాత్రి అనకా పగులనకా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా దానిని అడ్డుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శివరాజ్ పటేల్ కు ఫోను చేసి బెదిరించిన సురేష్ రెడ్డి, ఈసప్ప, భీమనులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని శనివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్
    నియోజకవర్గంలో కృష్ణ మాగనూరు మక్తల్ ఊట్కూరు మండలంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియాగత రెండున్నర సంవత్సరాల నుంచి లాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆయన తెలిపారు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక మాఫియా నారాయణపేట మహబూబ్నగర్ హైదరాబాద్ పక్క రాష్ట్రంలోని కర్ణాటక రాయచూరు తరలించడం జరుగుతుందని దీనిని అడ్డుకుంటున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా ఇసుక టిప్పర్లు దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు అక్రమంగా ఇసుక అనుమతులను తీసుకొచ్చి ఒకటికి పది ఇంతలా అక్రమ రవనను చేయడము జరుగుతుందని దీనిపట్ల అధికారుల ఉదాసీన వైఖరి వహించడం వలన మాఫియా ఆటలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు ప్రతినిత్యం మక్తల్ మండలం నుంచి ఓవర్ లోడు వేసుకునే టిప్పర్లు అతివేగంతో వెళ్లడం వలన ఎన్నో ప్రమాదాలు జరిగిన సంఘటనలో ఉన్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం పట్ల ఆయన తీవ్రంగా విమర్శించారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు శివరాజ్ పటేల్ ను బెదిరించిన దుండగులను పై వెంటనే చర్య తీసుకోకపోతే నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.