Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    Author VENKATESH | 21 Jun 2026, 05:22 PM | నారాయణపేట
    ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    నారాయణపేట జిల్లా, జూన్ 21 (బి వి కే న్యూస్)

    ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ జగదీష్ నిర్వహణలో యోగా గురువు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చత్రపతి శివాజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఉ:ము 6:00 గం:కు నిర్వహించిన యోగ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది.
    ఇట్టి కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులను మరియు విద్యార్థులను ఉద్దేశించి యోగ గురువు నారాయణ రెడ్డి మాట్లాడుతూ అనాది కాలము నుండి భారత దేశంలో యోగ అనేది శారీరక నిర్మాణానికి ఆధ్యాత్మిక చింతనానికి ఉపయోగపడేదని క్రమక్రమంగా అది మరుగుపడుతున్న దశలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకంలో ప్రస్తుతం యోగా అనేది ఐక్యరాజ్యసమితిలో గుర్తింపబడి అంతర్జాతీయ స్థాయిలో నేడు వివిధ దేశాల్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు కనీసం ఒక గంట యోగ చేయాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు
    S.రమేష్ రావు,V. లక్ష్మణ్ సింగ్ మిస్కిన్ వెంకట్రావు, K.చంద్రశేఖర్ గౌడ్,
    కర్ని నరసయ్య,
    V.అంజయ్య ఆచారి,
    B.అంబదాస్ రావు, కృష్ణ శ్రీకాంత్ చారి అక్షర స్కూల్ పిటి జగదీష్ ఇతర సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.