Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంత్యక్రియలకు మా డబ్బులే వాడండి..

    Author VENKATESH | 22 Jun 2026, 11:37 AM | చిత్తూరు
    అంత్యక్రియలకు మా డబ్బులే వాడండి..

    చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులనే వాడాలంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. నోట్‌లో బ్యాంకు ఏటీఎం కార్డు పిన్ నంబర్, ఫోన్ పే నంబర్‌ను రాసి ఉంచడం ఇప్పుడు కలచివేస్తోంది.
    వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా దిగుమసపల్లె పంచాయతీలోని బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదరం (30), నిర్మల (25) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రాజేశ్, శ్రీవిద్య. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో నిర్మలకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో సీఎంసీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. అయితే భార్య ఆరోగ్యం రోజురోజుకీ విషమించడం, ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో దామోదరం తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు. ఇన్ని బాధల్లో బతకడం కంటే చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
    ఈ క్రమంలోనే భార్య, ఇద్దరు పిల్లలకు విషమించి, అనంతరం దామోదరం రివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌తో పాటు బ్యాంక్ ఏటీఎంను ఉంచి, దాని పిన్ నంబర్, అలాగే ఫోన్‌పే నంబర్ రాసిపెట్టాడు. అంత్యక్రియలకు తమ ఖాతా నుంచే డబ్బులు వాడుకోవాలని కోరాడు.