Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తమ విద్యాసంస్థల అవినీతిని కప్పిపుచ్చుకున్నందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. బీసీ యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్..

    Author VENKATESH | 22 Jun 2026, 01:52 PM | కరీంనగర్
    తమ విద్యాసంస్థల అవినీతిని కప్పిపుచ్చుకున్నందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. బీసీ యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్..

    అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్షలలో అవకతవకలు జరుగాయని దానికి బాధ్యులైన కేంద్ర మంత్రిపై విమర్శలు చేసిన ఆ చైర్మన్ కు కరీంనగర్ నిజామాబాద్ , హైదరాబాద్, అదిలాబాద్ , వరంగల్ జిల్లాలలో అనేక విద్యాసంస్థలు ఉన్నవి అలాంటి విద్యా సంస్థలలో విద్యార్థులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే విద్యార్థులను తల్లిదండ్రులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈరోజు కరీంనగర్ లో బీసీ సంఘాల కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశంలో జిల్లా యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ అన్నారు ఈ సందర్భంగా మాదాసు సంజీవ్ మాట్లాడుతూ ఈ అధికార పార్టీకి చెందిన చైర్మన్ గారి యొక్క టెక్నో పాఠశాలలో కేవలం అడ్మిషన్ ఫీజు 25 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే ఇతర పాఠశాలలో ఇతర కళాశాలలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఇలా పేద విద్యార్థులను తల్లిదండ్రులను దోచుకుంటున్న ఆ విద్యాసంస్థల చైర్మన్ నీట్ పరీక్ష పై మాట్లాడడం విడ్డూరం యొక్క విద్యాసంస్థల చైర్మన్ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినారు విద్యార్థులు తల్లిదండ్రులు నిరుద్యోగులు అందరు కలిసి గెలిపివ్వలేదు ఇలా ఇక్కడ కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అక్కడ విద్యా సంస్థ చైర్మన్ కూడా అక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా గెలిపించలేదు ఇలా విద్యాసంస్థల చైర్మన్ లకు రాజకీయాలకు అవకాశాలు ఇవ్వకూడదు విద్యార్థులనుతల్లిదండ్రులను పట్టిపీడించే విద్యాసంస్థల చైర్మన్ లకు ఎలాంటి పదవి ఇచ్చినా ఆ పార్టీకే నష్టం ఇలాంటి వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని బీసీ సంఘాల పక్షానకోరుతున్నాం.గతంలో ఎలక్షన్లో పోటీ చేసిన అనంతరం ఆ యొక్క ఖర్చును విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ ఏకంగా వేలాది రూపాయల ఫీజులను పెంచడం జరిగింది ఇలా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఈ విద్యా సంస్థలయాజమాన్యంపైవిద్యార్థులు తల్లిదండ్రులు తిరగబడాలని సమావేశం కోరింది అలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శ చేసిన ఈ అధికార పార్టీకి చెందిన విద్యా సంస్థల చైర్మన్ యొక్క పాఠశాలల ఫీజులపై కళాశాల ఫీజులపై అక్రమ వసూళ్లపై కేంద్ర మంత్రులు దృష్టి పెట్టాలని సమావేశం కోరింది.ఈ అధికార పార్టీకి చెందిన విద్యా సంస్థల చైర్మన్ ప్రభుత్వాహనాన్ని ఉపయోగించుకొని తన భవన నిర్మాణానికి నిర్మాణ సామగ్రిని తెచ్చుకున్న విషయం బహిరంగమైంది దీనిపై ఎలాంటి విచారణ జరగలేదు. అలాగే ఈ విద్యాసంస్థలకు సంబంధించిన దానిపై త్వరలో ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నాం పేద విద్యార్థుల సొమ్మును పేద విద్యార్థులకు అందించేంతవరకు బలహీన వర్గాలను కలుపుకొని ఉద్యమిస్తామని సమావేశం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు ఎడ్ల సురేందర్ , దుప్పటపల్లి మురళి , వాయిల రాజ్ కుమార్ , చింటూ పటేల్ పోకల.విజయ్, సాయి కుమార్, చిట్టీమల్ల సాగర్, నరేష్, పూజిత,సరిత, లావణ్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు.