Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ బీ.సీ కాలనీ,బాబు జగ్జీవాన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సమస్యలపై డీ.ఈ.వోకి మెమొరాండం అందజేత

    Author VENKATESH | 23 Jun 2026, 07:25 PM | నారాయణపేట
    మక్తల్ బీ.సీ కాలనీ,బాబు జగ్జీవాన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సమస్యలపై డీ.ఈ.వోకి  మెమొరాండం అందజేత

    - బాబు జగ్జీవాన్ కాలనీ ప్రభుత్వ పాఠశాల అద్దె భవనం, స్కావెంజర్ పెండింగ్ బకలాయిలను వెంటనే చెల్లించాలి

    - సొంతంగా పాఠశాలలకే మిడ్ డే మీల్స్ పంపిణీ చేయాలి. నిర్వహణ గ్రాంట్లను కూడా వెంటనే విడుదల చేయాలి.

    - మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించిన ఈ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

    - డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, మక్తల్

    నారాయణపేట, జూన్ 23 (బివికె న్యూస్ )

    ఇవి కూడా చదవండి

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో ఎం ఆర్ సి విచ్చేసిన జిల్లా విద్యాధికారికి మక్తల్ బీ.సీ కాలనీ మరియు బాబు జగ్జీవన్ రామ్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెమోరాండం అందజేయడం జరిగిందన్నారు.

    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా DTF,డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాల నాయకులు చేసిన పోరాటం మరియు మంత్రి వాకిటి శ్రీహరి కృషి వల్ల పోయిన ఏడాది ఏర్పాటైన రెండు ప్రభుత్వ పాఠశాలలో ఒకటైన బాబు జగ్జీవాన్ రామ్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దె భవనంకు రావాల్సిన ఒక ఒక సంవత్సరం కి పైగా కిరాయి మరియు స్కావెంజర్ల గౌరవ వేతనంను ప్రభుత్వం చెల్లించకపోవడంతో యజమానులు పదేపదే పాఠశాలను ఖాళీ చేయమని ఉపాధ్యాయుడిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.ఈ కారణంగా పాఠశాల ఉంటుందా?ఊడుతుందా? ఇక్కడ తమ పిల్లల చదువు సజావుగా సాగుతుందా? లేదా? అనే అనుమానంతో తల్లిదండ్రులు,కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

    అదే కాకుండా బీ.సీ మరియు బాబు జగ్జీవాన్ కాలనీల ప్రభుత్వ పాఠశాలలకు యుడైస్ కోడ్ ఉన్నప్పటికీ వాటికి సొంతంగా మిడ్ డే మిల్స్ పంపిణీ చేయడంలేదని, మిడ్ డే మీల్స్ కోసం చుట్టూ పక్కల ఉండే హై స్కూల్స్ నుండి బియ్యం తీసుకొచ్చేటప్పుడు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని,కొన్నిసార్లు పిల్లలకు అన్నం దొరకని సందర్భాలు కూడా జరుగుతుంటాయన్నారు. కాబట్టి నేరుగా ఈ పాఠశాలలకే మిడ్ డే మిల్స్ ను పంపిణీ చేయాలనీ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమేన్నారు.

    ముఖ్యంగా మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఆడంబరంగా నిరుడు ప్రారంభమైన బీసీ మరియు బాబు జగ్జీవన్ రామ్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు గత పది ఏళ్లుగా నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్న దళిత,పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు,కాలనీవాసులు,ప్రజలు నిరాశ పడుతున్నారన్నారు.కావున గౌరవ మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే ప్రత్యేక చొరవతో ఈ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆశ భావం వ్యక్తం చేశారన్నారు.

    కార్యక్రమంలో అధ్యక్షులు పృథ్వీరాజ్,కోరి మారెప్ప బీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు, బాబు జగ్జీవన్ కాలనీ పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్కే అశోక్,ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు,గొల్లపల్లి నారాయణ,బుడగ జంగాల హక్కుల నాయకులు రాసూరి భీమేష్, స్కావెంజర్ శంకరమ్మ,జయలక్ష్మి,డా.బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జగ్గలి వేణు,తల్వార్ నరేష్, బీసీ కాలనీ, బాబు జగ్జీవన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.