Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఒలంపిక్, యోగా డే వేడుకలు

    Author VENKATESH | 23 Jun 2026, 07:26 PM | నారాయణపేట
    వాసవి క్లబ్ ఆధ్వర్యంలో  ఘనంగా అంతర్జాతీయ ఒలంపిక్, యోగా డే వేడుకలు

    - ఒలంపిక్ క్రీడాజ్యోతిని వెలిగిస్తూ జాతీయ జెండాలతో భారీ ర్యాలీ

    - అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాసవి క్లబ్ అధ్యక్షుడు హరికృష్ణ

    నారాయణపేట, జూన్ 23 (బి వి కె న్యూస్)

    ఇవి కూడా చదవండి

    మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ ఒలంపిక్ డే మరియు యోగా డే ను పురస్కరించుకొని మంగళవారం మక్తల్ పట్టణం మినీ స్టేడియంలో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు లక్ష కోచింగ్ సెంటర్ మరియు శివాజీ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఒలంపిక్ డే క్రీడాజ్యోతిని వెలిగించి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.యోగ డే గురించి పెద్దలు మాట్లాడుతూ..
    ప్రాచీన ఒలింపిక్ క్రీడలు
    ​ఇవి క్రీస్తుపూర్వం (బీసీ ) 776లో గ్రీస్‌లోని 'ఒలింపియా'లో ప్రారంభమయ్యాయి.గ్రీకు పురాణాల ప్రకారం, వారి దేవుడైన 'జియస్' గౌరవార్థం ఈ క్రీడలను నిర్వహించేవారు. దీని ప్రత్యేకత
    ​క్రీడలు జరుగుతున్న సమయంలో గ్రీకు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా వాటిని ఆపివేసేవారు. విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు. క్రీస్తుశకం 393లో రోమన్ చక్రవర్తి థియోడొసియస్ వీటిని నిషేధించడంతో సుమారు 1200 ఏళ్ల పాటు ఈ క్రీడలు ఆగిపోయాయి. రెండవది
    ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్‌కు చెందిన 'పియరీ డి కోబర్టీన్' ఆధునిక ఒలింపిక్స్‌ను పునరుద్ధరించారు. ఇతనిని 'ఆధునిక ఒలింపిక్ పితామహుడు' అని పిలుస్తారు.
    అనంతరం యోగ డే ని పురస్కరించుకొని మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో యోగ ఆసనాలు వేసి యోగా గురువులకు సన్మానించి, అనంతరం వచ్చిన అతిధులకు గురుకుల విద్యార్థిని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో మక్తల్ వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ , కార్యదర్శి కొత్త ఆంజనేయులు కోశాధికారి తాళంపల్లి పవన్ కుమార్ మాజీ డిప్యూటీ గవర్నర్ కల్వ శ్రీనివాసులు,మాజీ అధ్యక్షుడు బిలకంటి నరసయ్య, బిలకంటి జగదీష్, పొర్ల నాగరాజు, ఈనాడు లక్ష కోచింగ్ సెంటర్ కోచ్ జగదీష్,ఎం జె పి గురుకుల విద్యార్థిని విద్యార్థులు, శివాజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అంజయ్య ఆచారి, వీ.లక్ష్మణ్, నర్సింగ్ రావు, రమేష్ రావు, పి ఈ టీ లు శిల్ప, నవీన్, అవంతిక తదితరులు పాల్గొన్నారు.