Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య..

    Author VENKATESH | 24 Jun 2026, 04:56 PM | NATIONAL
    లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య..

    ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టూ జనం ఉండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం దర్జాగా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మయాంక్ లోహార్ మంగళవారం రాత్రి చర్చ్‌గేట్ నుంచి నల్లసోపారా వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కాడు.
    గోరేగావ్ - కందివాలి మధ్యలో తోటి ప్రయాణికుడితో మయాంక్‌కు గొడవైంది. వర్షం పడుతుండటంతో డోరు క్లోజ్ చేసే విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి మయాంక్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మయాంక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ఏడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.