Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమన్వయంతో పనిచేసి బాధితులకు న్యాయం అందించాలి

    Author VENKATESH | 24 Jun 2026, 06:08 PM | నారాయణపేట
    సమన్వయంతో పనిచేసి బాధితులకు న్యాయం అందించాలి

    : జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS

    ... భరోసా కేంద్రం సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరం

    ... మహిళలు, చిన్నారుల రక్షణలో భాగస్వామ్య శాఖల పాత్ర కీలకం

    ఇవి కూడా చదవండి

    నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్)

    నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పాల్గొని మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింస, వేధింపులు, లైంగిక దాడులు మరియు ఇతర నేరాల బాధితులకు తక్షణ సహాయం, రక్షణ, పునరావాసం, కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. బాధిత మహిళలు మరియు చిన్నారులకు అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేయడం సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, బాధితులకు సమగ్ర సేవలు అందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
    బాధిత మహిళలకు చిన్నారులకు తక్షణ సహాయం చేయడంలో సంబంధిత శాఖలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయా అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. భరోసా సెంటర్ కి వచ్చిన బాధితులకు మెడికల్, లీగల్, CWC అధికారుల దగ్గర కు పంపించకుండా వారి వద్దకే అందరూ వచ్చి న్యాయం చేసే విధంగా చూడాలని తెలిపారు. అలాగే వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. అలాగే ప్రతి నెల రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆ నెలలో ఎంతమంది బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి,వారికి అందించే ప్రభుత్వ పరిహారం తదితర విషయాలు గురించి చర్చించాలని తెలిపారు.
    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... దర్యాప్తు ప్రక్రియలో పోలీసు శాఖతో పాటు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా న్యాయ సేవల సంస్థ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్‌లైన్, కౌన్సిలర్లు మరియు ఇతర భాగస్వామ్య సంస్థలు సమిష్టిగా పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
    బాధితుల కేసుల పరిష్కారంలో జాప్యం జరగకుండా ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన కేసుల్లో అత్యంత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. బాధితుల పునరావాసం, విద్య, వైద్య సహాయం, మానసిక ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
    భరోసా కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగల వాతావరణాన్ని కల్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు ముందస్తు అవగాహన చేయాలని అలాగే సమాచారం అందితే వెంటనే సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.

    ఈ సమావేశంలో అదనపు ఎస్పీ MD రియాజ్ హుల్ హక్, DCRB డీఎస్పీ మహేష్, సీఐ లు శివ శంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి , విక్రం, నరేష్, రమేష్, శిరీష, సునీత, మహేశ్వరి, గాయత్రి, DM & HO జయ చంద్ర మోహన్,DWO రాజేందర్ గౌడ్, CWC చైర్మన్ అశోక్ శ్యామల, CI లు భగవంత్ రెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధులు, భరోసా సెంటర్ సిబ్బంది, దర్యాప్తు అధికారులు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.