Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫ్రైడే ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.

    Author VENKATESH | 26 Jun 2026, 11:28 AM | Cinema
     ఫ్రైడే ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.

    ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, ఓటీటీ వేదికలపై మాత్రం వినోద ప్రియులకు భారీ ట్రీట్ సిద్ధమైంది. ఒకే రోజు దాదాపు 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరోవైపు థియేటర్లలో ‘ఒక్కడు’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి హిట్ చిత్రాలు రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించనున్నాయి.
    ‘బాహుబలి టార్చ్‌బేరర్’ ప్రత్యేక ఆకర్షణ
    దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఈ సినిమాల వెనుక జరిగిన ప్రయాణం, యుద్ధ సన్నివేశాల రూపకల్పన, మేకింగ్ విశేషాలు, నటీనటుల అనుభవాలను చూపిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: టార్చ్‌బేరర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
    అమెజాన్ ప్రైమ్‌లో ‘దూరదర్శిని’
    సువిక్షిత్, గీతికా రతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దూరదర్శిని’ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
    జియో హాట్‌స్టార్‌లో ‘లింగం’
    కథీర్, దివ్య భారతి, పూర్ణిమ రవి, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లింగం’ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ పాండియన్ తెరకెక్కించిన ఈ సిరీస్‌పై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
    ZEE5లో హారర్ థ్రిల్లర్ ‘ముత్తాశి’
    హారర్ కథలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘ముత్తాశి’ అనే కొత్త థ్రిల్లర్ సిరీస్ ZEE5లో అందుబాటులోకి వచ్చింది. నందులాల్ ఎంఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కేపీఏసీ లీల, అమిత్ చకాలక్కల్, అఖిలా భార్గవన్ కీలక పాత్రలు పోషించారు.