Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికాతో థ్రిల్ల‌ర్‌.. ఆఖ‌రి నిమిషంలో నెగ్గిన ట‌ర్కీ

    Author VENKATESH | 26 Jun 2026, 11:37 AM | Sports
    అమెరికాతో థ్రిల్ల‌ర్‌.. ఆఖ‌రి నిమిషంలో నెగ్గిన ట‌ర్కీ

    ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌(FIFA World Cup)లో ట‌ర్కీ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. వాస్త‌వానికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జ‌ట్టు .. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో హోస్ట్ అమెరికాతో జ‌రిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో నెగ్గింది. గ్రూప్ డీ మ్యాచ్‌లో మొత్తం అయిదు గోల్స్ న‌మోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. ఆ గ్రూపులో మాత్రం ఆ దేశ‌మే అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. ఆట ప్రారంభ‌మైన మూడు నిమిషాల‌కే అమెరికా ప్లేయ‌ర్ ఆస్ట‌న్ ట్ర‌స్టీ గోల్ కొట్టాడు. డీప్ కార్న‌ర్ నుంచి సెబాస్టియ‌న్ అందించిన పాస్‌ను లెఫ్ట్ ఫూట్‌తో ట్ర‌స్టీ గోల్‌గా మ‌లిచాడు.
    టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినా.. అమెరికాతో మ్యాచ్‌లో మాత్రం ట‌ర్కీ ప‌ట్టుద‌ల‌తో ఆడింది. ఇక ట‌ర్కీ ప్లేయ‌ర్ గులేర్ 10వ నిమిషంలో ఆ జ‌ట్టుకు తొలి గోల్ అందించాడు. అర‌గంట ఆట ముగిశాక‌.. ట‌ర్కీ ప్లేయ‌ర్ బారిస్ యిల్మాజ్ మ‌రో గోల్ చేశౄడు. దీంతో ట‌ర్కీ లీడింగ్‌లోకి వెళ్లింది. రెండో హాఫ్ 49వ నిమిషంలో అమెరికా ప్లేయ‌ర్ బెర్‌హాల్ట‌ర్ గోల్ చేసి ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ రేపాడు. దాదాపు ఆట ముగిసే స‌మ‌యం వ‌ర‌కు రెండు జ‌ట్లు 2-2 గోల్స్ తేడాతో స‌మంగా పోరాడాయి.
    కానీ 98వ నిమిషంలో ట‌ర్కీ ప్లేయ‌ర్ అంద‌ర్నీ స్ట‌న్ చేశాడు. కాన్ అయాన్ గోల్ చేయ‌డంతో కీల‌క‌మైన మూడు పాయింట్లు ట‌ర్కీ ఖాతాలోకి వెళ్లాయి. అమెరికా జ‌ట్టు ఈ టోర్నీలో చ‌రిత్ర సృష్టిస్తోంది. ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఈవెంట్‌లో ఇప్ప‌టికే 8 గోల్స్ చేసింది. గ‌తంలో 1930, 2002లో అత్య‌ధికంగా ఏడు గోల్స్ మాత్ర‌మే చేసింది.