Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అనిరుధ్-కావ్య మారన్ పెళ్లిపై అఖండ 2 న‌టుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

    Author VENKATESH | 28 Jun 2026, 11:23 AM | Cinema
    అనిరుధ్-కావ్య మారన్ పెళ్లిపై అఖండ 2 న‌టుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

    కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్య మారన్‌ల వివాహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవుతారనే ప్రచారం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పుకార్లపై తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నాటకరంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ఒక తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న వై.జి. మహేంద్రన్, అనిరుధ్ వ్యక్తిత్వం, కావ్య మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనిరుధ్ ఎంతో మృదుస్వభావి, ప్రతిభావంతుడైన యువకుడని ఆయన కొనియాడారు.City & Local Guides
    అనిరుధ్ చాలా మంచి వ్యక్తి. అతను ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగినవాడు. అయితే ఏదో ఒక కారణం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందనిపిస్తోంది. కానీ త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను అని వై.జి. మహేంద్రన్ వ్యాఖ్యానించారు. అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని, ఈ విషయంలో తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. తాను కూడా విన్న సమాచారాన్ని బట్టే మాట్లాడుతున్నప్పటికీ, ఈ వివాహం జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి చాలా అందమైన జంటగా కనిపిస్తారని, మంచి దంపతులుగా పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు.
    ఇక కావ్య మారన్ గురించి మాట్లాడిన వై.జి. మహేంద్రన్, ఆమెను కేవలం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన వ్యాపారవేత్తగా అభివర్ణించారు. తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార దక్షతను పూర్తిగా అలవర్చుకున్నందువల్లే కావ్య మారన్ ఇంత పెద్ద స్పోర్ట్స్ ఫ్రాంచైజీని విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. గతంలో సన్ టీవీ ఓటీటీ విభాగంలో కావ్య మారన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన కోసం ఆమెను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారని, కథలు నచ్చడంతో ఒకేసారి ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగకపోయినా, వ్యక్తిగా కావ్య మారన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు.