Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పల్స్‌ పోలియో కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం - అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్: సుధ రాజేంద్ర

    Author VENKATESH | 28 Jun 2026, 03:11 PM | కరీంనగర్
    పల్స్‌ పోలియో కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం - అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్: సుధ రాజేంద్ర

    దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఉచిత పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోలియో చుక్కల పంపిణీ నిర్యహణలో శాతవాహన లయన్స్‌ క్లబ్‌ సీనియర్‌ సభ్యులు రీజియన్‌ చైర్మన్ లయన్‌ వడపకాపురం జగదీశ్వరాచారి చొరవతో వైద్య సిబ్బందికి ఉచితంగా 600 విజిటెబుల్‌ బిర్యానీ, పెరుగు, మంచి నీటి బాటిల్స్‌ అందించడం ప్రశంసనీయమని అదనపు డిఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్: సుధ రాజేంద్ర కొనియాడారు. ఈ రోజు బుట్టి రాజారాం కాలనీ రూరల్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలియో చుక్కల పంపిణీ సిబ్బందికి ఆహారపు ప్యాకెట్లు, మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌, పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పెండు తుక్కు పోలియో టీకా మందుతో జీవితకాల రక్షణ కలుగుతుందని అంటూ, ఈ సందర్భంగా అందరూ తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత కరీంనగర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆహార ప్యాకెట్ల దాత ప్రాంతీయ చైర్మన్‌ లయన్‌ వడుకాపురం జగదీశ్వరా చారి మాట్లాడుతూ ఇలాంటి అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమంలో సేవలు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దాదాపు రూ: 60,000 విలువైన 600 వెజిటబుల్ బిర్యానీ, మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌, పెరుగు ప్యాకెట్లను అందించడం సదవకాశంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్‌ కెప్టెన్‌ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, లయన్‌ ఇనుగుర్తి రమేష్, లయన్‌ డి తిరుపతి రెడ్డి, లయన్‌ ఎం మహేందర్‌, లయన్ ఎన్‌‌ వేణుగోపాల్, లయన్‌ ఎం ప్రవీణ్ కుమార్, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వైద్యురాలు డాక్టర్ : అలేఖ్య, పల్స్‌ పోలియో సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.