Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 22 రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు..

    Author VENKATESH | 28 Jun 2026, 03:25 PM | TELANGANA
    22 రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు..

    రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇవాళ యూపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు యూపీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని వెల్లడించింది. గత 16 రోజులుగా బిహార్‌ సరిహద్దు వద్దే రుతుపవనాలు ఆగిపోయాయని ఐఎండీ తెలిపింది.

    రాజస్థాన్‌ సహా ఏడు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా నమోదు అవుతున్నాయని వెల్లడించింది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అసోం, మేఘాలయ, బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సిక్కిం, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జార్ఖండ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మధ్య ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.