Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 19వ వార్డులో విజయవంతమైన పోలియో చుక్కల కార్యక్రమం

    Author VENKATESH | 28 Jun 2026, 06:59 PM | నల్గొండ
    19వ వార్డులో విజయవంతమైన పోలియో చుక్కల కార్యక్రమం

    దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) :
    పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం దేవరకొండ పట్టణంలోని 19వ వార్డులో అత్యంత ఉత్సాహంగా, విజయవంతమైనది.5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా వారిని భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
    ​ఈ కార్యక్రమంలో భాగంగా RP జ్యోతి,ఆశా కార్యకర్త లక్ష్మి,వాలంటరీలు ప్రశాంతి,శైలజ పాల్గొని, తమ వార్డు పరిధిలోని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
    ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,"పోలియో రహిత సమాజమే మా లక్ష్యం.ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సకాలంలో పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత.ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు స్థానికుల నుంచి వస్తున్న మద్దతు అభినందనీయం" అని పేర్కొన్నారు.​స్థానిక తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, పోలియో చుక్కలు వేయించుకున్నారు. వార్డులోని ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.