Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది.

    Author VENKATESH | 29 Jun 2026, 11:34 AM | Sports
    ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది.

    భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అద్భుత ప్రదర్శనలతో సీనియర్ జట్టులో చోటు సంపాదించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. కాగా సీనియర్ ప్లేయర్లు పూర్తిగా విఫలమవ్వడంతో.. వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసి ఉంటే బాగుండేదని వెల్లడించాడు.

    ‘వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇవ్వాలని నేను భావించాను. ఈ రెండు మ్యాచుల్లో అతడిని ఆడించి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మంచి ఆరంభం అయ్యేది. రాబోయే కఠిన సిరీస్‌లకు ముందు ఇది సరైన వేదిక అయ్యేది. వైభవ్ ఎప్పటికైనా భారత జట్టులో ఆడాల్సిందే. అందుకోసం ఎక్కువ కాలం ఎదురుచూస్తూ ఉండటం సరైంది కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ అతడి గురించి ఆలోచించాలి. అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్‌తో కలిసి వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలి. అతడు పూర్తిగా పక్కన పెట్టే ప్లేయర్ కాదు. ఐర్లాండ్‌తో కాకపోతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయినా వైభవ్‌ను అవకాశం రావాలి’ అని గావస్కర్ వెల్లడించాడు.