Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి.

    Author VENKATESH | 29 Jun 2026, 07:49 PM | నల్గొండ
    రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి.

    ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదినం సందర్భంగా జూలై 3న రక్తదాన శిబిరం
    దేవరకొండ 29జూన్ (BVK 3 న్యూస్ ) : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దేవరకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ వారి సహకారంతో జులై మూడో తేదీనా కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాన్ని రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దేవరకొండ నియోజకవర్గ నాయకులు గుర్రపు తండ సర్పంచ్ రామావత్ సేవ నాయక్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని శ్రీ క్రాంతి జూనియర్ కళాశాలలో రక్త దాన శిబిరం పోస్టర్ను వారు ఆవిష్కరణ చేశారు. రక్తదానం చేసేవారు తమను 9666286396 సంప్రదించాలని కోరారు.దానాల్లో అతి గొప్ప దానం రక్తదానమని, ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని వారి తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం దొరకక ఇబ్బందులు పడే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనీ,
    ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహా రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రాణదాతలు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ క్రాంతి డిగ్రీ & జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు ఆంజనేయులు, అశోక్ ఎన్.ఎస్.యు.ఐ దేవరకొండ నాయకులు పసుపులేటి శివ, గుండాల రాజేష్ యాదవ్ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.