Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి నీక్రమశిక్షణే నీ ప్రగతి పథం

    Author VENKATESH | 29 Jun 2026, 07:54 PM | కరీంనగర్
    ఓ మనిషి నీక్రమశిక్షణే నీ ప్రగతి పథం

    ఓ మనిషి ఆశయం ఉన్నంత
    మాత్రాన సరిపోదు
    ఆచరణలో పెట్టే క్రమశిక్షణ
    నీ జీవన శైలి కావాలి
    క్రమశిక్షణ అనేది నీఊహలకు
    నీవుసాధించే విజయానికి
    మధ్య వారధి
    ఆశలు ఆకాంక్షలు నెరవేరి
    ఆశయాలశిఖరాన్ని చేరాలంటే
    ఆలోచనలకు పదును పెట్టాలి

    లక్ష్యసాధన వైపు సాగాలంటే
    క్రమశిక్షణే ఆయుధంగా
    పట్టుదలే పెట్టుబడిగా
    నిరంతర కృషియే ధ్యేయంగా
    ముందుకు సాగాలి
    నియమం లేని ప్రయాణం
    గమ్యం లేని నావ అవుతుంది
    శ్రమతత్వ గుణమే
    నీ జీవితాన్ని మార్చుతుంది
    సమయపాలన నీ శ్వాస కావాలి
    విశ్వసనీయత నీ మాట కావాలి
    సత్ప్రవర్తన నీ బాట కావాలి
    అప్పుడే విజయాలు
    నీవశమౌతాయి
    సోమరితనం వదిలి పెట్టు
    స్వయం కృషితో ఎదుగు
    క్రమశిక్షణే నీఎదుగుదలకు నిచ్చెన
    అదే నీ ప్రగతికి ఆసలైన ఆయుధం
    ఙ్ఞానం శీలంతో పాటు క్రమశిక్షణ
    అత్యంత అవసరం ఆది లేని
    జీవితం చుక్కాని లేని నావ
    లాంటిది
    ఎపిజెఅబ్దుల్ కలాం అన్నట్లు
    క్రమశిక్షణ అనేది మానవుని
    జీవితాన్ని ఒక పద్ధతిలో నడిపించే
    శక్తి అదే మనిషిని ఉన్నతునిగా
    మారుస్తుంది
    ప్రలోభాలకు లొంగక
    ప్రగతి దారిలో నడవటానికి
    క్రమశిక్షణే నీ మార్గదర్శి
    నీ క్రమశిక్షణే నీకు రక్షణ
    క్రమశిక్షణ అనేది కోరికలపై
    సాధించే విజయం తనను
    తానునియంత్రిచుకోగలవాడే
    నిజమైన విజేత
    ఓ మనిషి మనసును మన
    ఆధీనంలో ఉంచుకోవడమే
    నిజమైన క్రమశిక్షణ అదే మనిషిని
    ఉన్నతుడిగా మారుస్తుంది
    అన్నస్వామి వివేకానంద
    వాఖ్యను స్పూర్తిగా తీసుకోవాలి
    వికసిత భారత్ లక్ష్య సాధనకై
    ఉద్యమించాలి
    నేదునూరి కనకయ్య
    కాలమిస్ట్ రచయిత
    కరీంనగర్9440245771