Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం

    Author VENKATESH | 30 Jun 2026, 10:54 AM | నారాయణపేట
    బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం

    మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు సాయిరెడ్డి కమలమ్మ, కుమారుడు అనురాగ్ రెడ్డిలు
    - దాదాపు 700 మందికి పైగా వైద్య పరీక్షలు ఉచిత మందుల పంపిణీ, రగ్గుల పంపిణీ
    - యశోద హాస్పిటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత వైద్య పరీక్షలు
    నారాయణపేట (మక్తల్) జూన్ 29 (బి వి కే న్యూస్)
    బీకేఆర్ ఫౌండేషన్ (BKR Foundation) అధినేత గవినోల బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ ఆవరణలో యశోద ఆసుపత్రి, అగర్వాల్ ఐ ఆస్పత్రి నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఇట్టి శిబిరాన్ని బాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులైన సాయి రెడ్డి కమలమ్మ, మామయ్య బాల్రెడ్డి, కుమారుడు అనురాగరెడ్డి చేతుల మీదుగా ఇట్టి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.
    ఇట్టి శిబిరంలో దాదాపు 700 మందికి పైగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత బంధువులు ఇవ్వడంతో పాటు కప్పుకోవడానికి పేద ప్రజలకు 1500 రగ్గులను పంపిణీ చేయడం జరిగింది

    వైద్య సేవలు:

    గుండె జబ్బులు (కార్డియాలజీ), మహిళల (గైనకాలజీ), కంటి వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
    ఉచిత పరీక్షలు & మందులు:
    అలాగే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, ఈసీజీ (ECG), 2డీ ఈకో వంటి అధునాతన పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి మందులు మరియు కంటి అద్దాలు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల క్యూస్షన్ ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యాన్ని చేకూర్చారు.
    ఘనంగా వైద్యులకు సన్మానం...
    అనగా వైద్య శిబిరం విజయవంతం కావడంతోటి యశోద ఆసుపత్రి, అనురాగం ఐ కంటి ఆసుపత్రి వైద్య బృందాన్ని టెక్నీషియన్ ని బి కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి సమక్షంలో ఘనంగా సత్కరించారు.
    వైద్యులను సత్కరించిన వారిలో....
    డిప్యూటీ మేనేజర్ శ్రీధర్, డాక్టర్ రవితేజ, డాక్టర్ నీలోఫర్, 2 డి Eco టెక్నీషియన్ డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ హరీష్, డాక్టర్ రాజు, డాక్టర్ నిహారిక
    నర్సింగ్ స్టాప్....
    దుర్గా, సంతుల్, మధుర, కార్తీక్, బిఎండి టెక్నీషియన్ రియాజ్
    అగర్వాల్ ఐ ఆస్పత్రి బృందం...
    డాక్టర్ గోవర్ధన్, హారిక, పరుశురాం
    ల్యాబ్ టెక్నీషియన్....
    శ్రీకాంత్, రవి, బాలాజీ, చెందూ లను ఘనంగా సత్కరించారు.
    ఇట్టి కార్యక్రమంలో బికేఆర్ ఫౌండేషన్ అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి