Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ సాయి రాఘవేంద్ర నగర్‌లో విద్యుత్ పరికరాల చోరీ: దేవరకొండ పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు

    Author VENKATESH | 30 Jun 2026, 08:26 PM | నల్గొండ
    శ్రీ సాయి రాఘవేంద్ర నగర్‌లో విద్యుత్ పరికరాల చోరీ: దేవరకొండ పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు

    దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) :
    మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వెంచర్‌లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కాపర్ వైర్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లలోని విలువైన పరికరాలను దుండగులు అపహరించుకుపోయారు.
    ​ఈ చోరీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, వెంటనే స్పందించి దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవరకొండ సి.ఐ. వెంకట్ రెడ్డి గారికి జరిగిన ఘటన వివరాలను అందజేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    ​విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించడమే కాకుండా, ప్రజా ఆస్తిని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే పట్టుకోవాలని స్థానిక ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.