Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను వెంటనే నియమించాలి

    Author VENKATESH | 01 Jul 2026, 11:31 PM | నారాయణపేట
    ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను వెంటనే నియమించాలి

    ఎంఈఓ కు ఏబీవీపీ వినతి
    నారాయణపేట, (మక్తల్) జూలై 1 (బి వి కే న్యూస్)
    2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలలో విద్యా వాలంటీర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని బుధవారం మక్తల్ పట్టణంలోని మండల విద్యాధికారి అభివృద్ధిని ఏబీవీపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
    ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
    ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ మాట్లాడుతూ మఖ్తల్ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు విద్యా వాలంటీర్ పోస్టులను తక్షణమే నియమించాలని MEO ని కోరారు.
    అలాగే మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీఎం శ్రీ (బాలుర) , జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పాఠశాలలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులను, మూత్రశాల లను, ప్రహరీ గోడలను నిర్మించి విద్యార్థులకు మంచి మాలిక వసతులను కల్పించాలని వారిని డిమాండ్ చేశారు..
    BC కాలనీ లో, బాబు జగ్జీవన్ రావ్ కాలనీలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలలో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నూతన భవనం నిర్మించాలని అలాగే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. అలాగే మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారంగా పురుగులు,రాలు లేని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వారికి విజ్ఞప్తి చేశారు..
    ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఆ దిశగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు అన్ని సమస్యలను విన్న ఎంఈఓ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆనంద్ కార్తీక్ శివ అనిల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.