Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సూచనల ప్రకారం 100% తృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలి

    Author VENKATESH | 02 Jul 2026, 12:21 AM | నారాయణపేట
    యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సూచనల ప్రకారం 100% తృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలి

    - జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక
    - విద్యాభరమైన సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
    నారాయణపేట, (నర్వ) జూలై 1 (బి వి కె న్యూస్ )
    నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లోని ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు , సామాజిక అభివృద్ధి రంగాలలో కీలకమైన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ABP) సూచికల ప్రకారం వంద శాతం సంతృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. బుధవారం కలెక్టర్ నర్వ యాస్పరేషన్ బ్లాక్ పర్యటనలో భాగంగా ఆ మండలంలోని పాతర్ చేడ్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ లో పదో తరగతి విద్యార్థులు తయారు చేసిన త్రీ డి ప్రింటర్, రిమోట్ కార్, ఎలక్ట్రికల్ ఫ్యాన్, వాటర్ ప్లాంట్, సోలార్ స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రానిక్ వాహన ప్రదర్శనలను తిలకించి విద్యార్థులను అభినందించారు. త్రీడి ప్రింటర్ ను తయారు చేసిన ఓ విద్యార్థి కలెక్టర్ పేరును ముద్రించి కలెక్టర్ కు బహుమతిగా ఇచ్చాడు. కంప్యూటర్ గదిని పరిశీలించిన కలెక్టర్ పదో తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఖాన్ అకాడమీ, విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించి, ఈ సారి పదో తరగతి ఫలితాల్లో 550 కి పైగా మార్కులు సాధించాలని సూచించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాల ను శ్రద్ధగా విని ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకుంటే 550 మార్కులు సాధించడం చాలా సులువు అని తెలిపారు. పాఠశాల వంటగదిని, మధ్యాహ్న భోజన సరుకులను పరిశీలించారు. పాఠశాలలో బాలికలకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని, బాలుర ( బాయ్స్)కు లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు ఆమె సూచించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మింప చేయించాలని, రాయ్ కోడ్ నుంచి పాతర్
    చేడు వరకు పాఠశాల సమయంలో ఆర్టీసీ బస్సు ను నడిపించాలని గ్రామ సర్పంచి నింగమ్మ కలెక్టర్ ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం
    రాయికోడ్ గ్రామ అంగన్ వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉన్నారని, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆట వస్తువులు, బొమ్మలను చూశారు. చిన్నారులు పాడిన గేయాన్ని విని అభినందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి జీవన ఉపాధుల సమ్మేళిత కార్యక్రమంలో భాగంగా నిరుపేద మహిళలకు కల్పిస్తున్న ఉపాధి పనుల గురించి తెలుసుకున్నారు. జిల్లాలోని నర్వ మండలంలో మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీవో కలెక్టర్ కు తెలిపారు. అనంతరం కలెక్టర్ నర్వ పల్లె దవాఖానాకు వెళ్ళి రికార్డులను పరిశీలించి
    ఇమ్యూనైజేషన్, ఎన్ సి డి స్క్రీనింగ్ ఎలా కొనసాగుతోందని, ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో వంద శాతం పూర్తి చేసారా లేదా అని ఆశా కార్యకర్తలను ప్రశ్నించారు.
    ఆ తర్వాత నర్వ మండల కేంద్రంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కేంద్రంలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
    హెచ్ డీ ఎఫ్ సీ పరివర్తన్ ఆర్థిక సాయంతో రాంకీ ఫౌండేషన్ ద్వారా నర్వ మండలంలోనీ అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కల్పిస్తున్న మౌలిక వసతి సౌకర్యాల గురించి ఆ ఫౌండేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. నర్వ గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినుల యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత నర్వ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిని, డ్రగ్ స్టోర్ ను, వ్యాక్సినేషన్ గదిని ఆమె పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. చివరగా కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఆయా కార్యక్రమాలలో డీ ఆర్డీవో వెంకట్ రాములు, డీ ఈ వో గోవింద రాజులు, డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, తహసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పాతర్ చేడ్ సర్పంచి నింగమ్మ, రాయికోడ్ సర్పంచి శశికళ, నర్వ సర్పంచి హనుమంత్ రెడ్డి, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయ కర్త బాలాజీ తదితరులు పాల్గొన్నారు.