Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సాయి, పడిక్కల్ హాఫ్‌ సెంచరీ..

    Author VENKATESH | 03 Jul 2026, 04:50 PM | Sports
    సాయి, పడిక్కల్ హాఫ్‌ సెంచరీ..

    రెండో అనధికారిక టెస్టులో భారత- ఏ బ్యాటర్ల దంచేస్తున్నారు. గాలే స్టేడియంలోఓపెనర్ సాయి సుదర్శన్ ‌(87 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్‌(74 నాటౌట్) అర్ధ శతకాలతో కదం తొక్కారు. శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేసిన ఈ ద్వయం శతక భాగస్వామ్యం నెలకొల్పగా ఇండియా-ఏ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. సెంచరీకి చేరువైన వీరిద్దరూ.. చేతిలో మరో తొమ్మిది వికెట్లు ఉండడంతో ఆతిథ్య జట్టు స్కోర్‌ను దాటేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లడం ఖాయం.
    శ్రీలంక పర్యటనలో భారత -ఏ జట్టు ధీటుగా ఆడుతోంది. తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంతో రెండో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇండియా-ఏ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. లంక ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఓపెనర్ సాయి సుదర్శన్‌(87 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్‌(74 నాటౌట్) అర్ధ శతకాలతో రెచ్చిపోయారు.