Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శభాష్ వార్డ్ కౌన్సిలర్ అల్కూరి పావని అంటున్న 16వ వార్డు ప్రజలు

    Author VENKATESH | 03 Jul 2026, 07:37 PM | నారాయణపేట
    శభాష్ వార్డ్ కౌన్సిలర్  అల్కూరి పావని అంటున్న 16వ వార్డు ప్రజలు

    - 16వ వార్డులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు.
    - పాల్గొన్న స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని, కమిషనర్ రాజయ్య, ఇతర కౌన్సిలర్ లు..
    నారాయణపేట, జూలై 3 (బివికె న్యూస్)
    మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ను సుభాష్ కౌన్సిలర్ గారు అంటున్న వీధి ప్రజలు. వయసు చిన్న బాధ్యత ఎంతో గొప్ప తండ్రి యొక్క పూర్తి సహకారంతో 16 వార్డులో ఎన్నడు జరిగినటువంటి అభివృద్ధి పని జరుగుతుండడాన్ని ఆ వీధి ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు. కారణం ఆ బార్డర్లు జరుగుతున్న అభివృద్ధి పనులే ఎందుకు ప్రధానమని చెప్పక తప్పదు. శుక్రవారం 16వ వార్డు లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదివే విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఇతర అధికారులు సిబ్బందితో కలిసి పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించినట్లు స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కురి పావని తెలిపారు. ఐదవ వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్, మరో కౌన్సిలర్ నరసింహతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా మంత్రి వాకటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని, వాటిని పరిష్కరిస్తూ వచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవి కుమార్, మార్కెట్ డైరెక్టర్ శాలం, కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, గుంతలి శివ కుమార్, పాఠశాల సిబ్బంది ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.