Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్ ఐ ఆర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి...

    Author VENKATESH | 04 Jul 2026, 06:09 PM | నారాయణపేట
    ఎస్ ఐ ఆర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి...

    బిజెపి నియోజకవర్గ బిఎల్ఏ 1 జి.బలరాంరెడ్డి..
    నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్ )
    కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు ఓటర్లందరూ స్వచ్ఛందంగా తమ ఓటు వివరాలను పూర్తిస్థాయిలో అందజేసి సహకరించాలని బిజెపి మక్తల్ నియోజకవర్గ బిఎల్ఏ 1 జి.బలరాంరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత నెల 25 నుంచి మొదలైన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 24 వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం లోని అన్ని పోలింగ్ బూతుల పరిధిలో బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు వివరాలను ఫారంలో పొందుపరిచి సంబంధిత బిఎల్ఓ లకు సకాలంలో అందజేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఎస్ఐఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రజలు దీన్ని ఏమాత్రం విశ్వసించకుండా తమ ఓటు పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం కు అందేలా చూసి తమ విలువైన ఓటును కాపాడుకోవాలని బలరాం రెడ్డి అన్నారు.