Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విశ్వసనీయతకు మరో మారు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరి..

    Author VENKATESH | 04 Jul 2026, 06:16 PM | నారాయణపేట
    విశ్వసనీయతకు మరో మారు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరి..

    - మూడోసారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అల్కూరి రవికుమార్ కు అవకాశం..
    - మంత్రి వాకిటి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపిన రవికుమార్..
    నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్)
    సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని నిబద్దతతో విశ్వసనీయతతో సేవ చేసి, ఎదురుచూసిన వారికి కాంగ్రెస్ పార్టీ డోకా చేయబోదని, అలాంటి వారికే పట్టం కడతారని మరోసారి ఎంతో నమ్మకముతో వ్యక్తం అయింది.
    దశాబ్దాల తరబడి అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, మంత్రి వాకిటి శ్రీహరికి చేదోడు వాదోడుగా నిలిచిన అలుకూరి రవికుమార్... వరుసగా మూడోసారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికై సత్తా చాటాడు. ఈ సందర్భంగా తనకు మూడోసారి అవకాశం ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి రుణపడి ఉంటాను అని ధన్యవాదాలు తెలిపారు.
    02014 నుంచి ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్... ఇలా ముగ్గురు పిసిసి అధ్యక్షులు హయాంలో.. మక్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసే అవకాశం తనకు ఇచ్చారని, ఈ సందర్భంగా ఆ ముగ్గురు పిసిసి అధ్యక్షులతో పాటు, తనకు ఈ హోదా దక్కడం లో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత మంత్రి వాకిటి శ్రీహరికి జీవితాంతం రుణపడి ఉంటానని రవి కుమార్ అన్నారు.
    కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే ధ్యేయంగా పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తానని, వరుసగా మూడోసారి తనకు అవకాశం రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరుకు ధన్యవాదాలు తెలిపారు. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయవంతం కావడానికి సహకరించిన టౌన్ కాంగ్రెస్ కీలక నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించారు. రాబోయే రోజుల్లో సైతం ఇదే సహకారాన్ని అందిస్తూ, మక్తల్ టౌన్ లో కాంగ్రెస్ ను తిరుగులేని పార్టీగా , ఎదురులేని శక్తిగా తయారు కావడంలో మరింతగా సహకరించాలని కోరారు.