Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థులకు నీటి సమస్య పరిష్కారం పచ్చి అబద్ధం.

    Author VENKATESH | 04 Jul 2026, 06:25 PM | నారాయణపేట
    విద్యార్థులకు నీటి సమస్య పరిష్కారం పచ్చి అబద్ధం.

    కమిషనర్ హోదాలో తప్పుడు ప్రకటనలా?
    - పరిష్కారానికి, ఉచిత సలహాలకు తేడా లేదా?.
    నారాయణపేట, జూలై 4 (బి వి కె న్యూస్)
    మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్యపై అంబేద్కర్ యువజన సంఘం, మానవ హక్కుల నాయకుల ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం సమస్య పరిష్కారానికి విన్నవించిన పత్రికా ప్రకటనను చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసి కమిషనర్ నాయకత్వంలో పాఠశాలను సందర్శించడం స్వాగతించాల్సిన విషయమే కానీ కమిషనర్ ఏ హోదాలో అన్ని పార్టీల నాయకులను కౌన్సిలర్లను పాఠశాలకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికై ఏ చొరవ చూపారో కమిషనర్ బహిరంగ ప్రకటన చేయాలి. లేదా అన్ని పార్టీల నాయకులతో పాటు కమిషనర్ హోదాలో తను పర్యటించార? అనే విషయం కూడా బహిరంగపరచాలి.
    కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వ యంత్రాంగం పాఠశాలను సందర్శించి ఉచిత సలహాలు,హామీలు ఇచ్చి రావడం తప్ప నిజంగా సమస్యను పరిష్కరించలేదు. 500 మంది పిల్లలు వ్యవసాయ కుటుంబాల నుండి కార్మిక కుటుంబాల నుండి డబ్బులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లలేని పిల్లలు ప్రభుత్వ పాఠశాలను నమ్ముకొని వస్తే కనీసం శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాగం, పాలకవర్గాలు వెనకాడడం సిగ్గుచేటయిన విషయం. పిల్లలు మధ్యన భోజన సమయానికి మంచినీళ్లు లేకపోవడంతో పాఠశాలలో ఉన్న ఉప్పు నీటినే తాగి అనేక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది.
    ఇందులో రాజకీయాలకు చావు లేకుండా సహృదయంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పాతిపదికన మిషన్ భగీరథ నీళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజల పట్ల వారి పిల్లల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న శాశ్వత ప్రాతిపదిక సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
    ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్లుగా నిలబడుతున్న ఈ పాఠశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టాల్సింది పోయి, సమస్యల వలయంలోకి నెట్టివేసి, కార్పొరేట్ ప్రవేట్ పాఠశాలలకు పరోక్షంగా మద్దతు ప్రకటించడానికె పూనుకుంటున్నారనే అనుమానాలు రాక మానవు. పేద పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం సరైనది కాదు.
    దయచేసి ఇప్పటికైనా మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పాఠశాలకు ప్రత్యేకంగా మంచినీటి కనెక్షన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
    అలాగే ఈ పాఠశాలలో పాడుబడ్డ భవనాలు ఉండడంవల్ల పాములు, తేళ్లు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున దయచేసి పాడుపడ్డ ఆ భవనాలను కూల్చివేసి, మధ్యలోనే ఆగిపోయిన నూతన భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
    ఈ కార్యక్రమంలో మద్దిలేటి
    మానవ హక్కుల కార్యకర్త, కె.పృథ్వీరాజ్
    (అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు)
    జె. వెంకటపతి రాజు పుడమి ఫౌండేషన్ చైర్మన్, సందీప్ , నాగేష్
    అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.