Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్ ప్రక్రియ మక్తల్ మున్సిపల్ టౌన్ పరిశీలకుడిగా NSUI నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రొజ్ నియామకం

    Author VENKATESH | 06 Jul 2026, 05:50 PM | నారాయణపేట
    సర్ ప్రక్రియ మక్తల్ మున్సిపల్ టౌన్ పరిశీలకుడిగా NSUI నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రొజ్ నియామకం

    నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్)

    SIR ప్రక్రియకు మైనార్టీ ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న మక్తల్ మున్సిపల్ టౌన్ పరిశీలకుడిగా NSUI నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రొజ్ ను మంత్రి వాకిటి ఆదేశాల మేరకు నియామకం జరిగింది.
    రాష్ట్ర మంత్రివర్యులు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ మున్సిపాలిటీలో జరుగుతున్న SIR - (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) ప్రక్రియకు 5, 7, 11, 12, 15, 16 వార్డుల పరిశీలకుడిగా NSUI మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రొజ్ గారిని నియమించడం జరిగింది.

    ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, "పైన పేర్కొన్న వార్డుల్లోని బూత్ లెవెల్ ఆఫీసర్లు - BLO లతో, బూత్ లెవెల్ ఏజెంట్లు - BLA లతో సమన్వయం చేసుకుని SIR ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు . ఒక్క ఓటరు కూడా తొలగిపోకుండా* చూసుకోవాలి. ఓటును కాపాడుకునే బాధ్యత యువ నాయకులపైనే ఉంది" అఫ్రొజ్ కి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
    ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ .రవి ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి