Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తీదేడు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై అవగాహన – ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి

    Author VENKATESH | 06 Jul 2026, 05:51 PM | నల్గొండ
    తీదేడు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై అవగాహన – ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి

    - ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
    - తీదేడు గ్రామ సర్పంచ్

    దేవరకొండ 06జూలై (BVK 3 న్యూస్ ) : చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామ ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి,కొత్త ఓటరు నమోదు,పేరు మార్పులు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును పరిరక్షించు కోవాలని ఆమె సూచించారు.గ్రామ ప్రజలు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలతో ముందుకు వచ్చి సహకరించాలని, పారదర్శకమైన మరియు ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమెఅన్నారు.అధికారులు సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ బి.ఎల్.ఓ సిమర్ల శ్రీను యాదవ్,జూనియర్ అసిస్టెంట్ రజిత, గ్రామ పాలన అధికారి యాదయ్య,రికార్డు అసిస్టెంట్ వెంకన్న,బి.ఎల్.ఓ లు చింతకుంట్ల అంజమ్మ,గంటెల చంద్రయ్య,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.