Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ జిల్లాలో ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ.

    Author VENKATESH | 28 Jun 2026, 08:59 AM | TELANGANA, నల్గొండ
    నల్లగొండ జిల్లాలో ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న ఎస్ఎఫ్ఐ  దేవరకొండ డివిజన్ కమిటీ.

    ​ దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.
    ​ఈ సందర్భంగా బుడిగా వెంకటేష్, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ:
    ​ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అన్నారు.
    ​ముఖ్యమంత్రి పర్యటన సాకుతో తెల్లవారుజామునే నాయకుల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
    ​ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకుల గొంతు నొక్కడం సరికాదని, ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
    ​ప్రభుత్వం ఇటువంటి నిర్బంధ విధానాలను వీడి, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఈ ప్రకటన ద్వారా కోరుతున్నాము.